పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్‌

Views: 52
Avantgardia

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్‌

పోలవరం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం చేరుకున్న సీఎం .. మూడు సార్లు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని, ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణాలను పరిశీలించారు. హెలికాప్టర్‌ దిగిన తర్వాత జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వ్యూ పాయింట్‌కు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నదీగర్భంలో నిర్మిస్తున్న కాఫర్‌డ్యామ్‌కు సంబంధించి ప్రధానంగా సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ఎంత వరకు పూర్తయ్యాయి? భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటి? ఇది కొట్టుకు పోకుండా తీసుకున్న రక్షణ చర్యలు ఏమిటి? గోదావరిలో వరద వస్తుందని తెలిసీ సీజన్‌ ముగిశాక ఎలా నిర్మాణం చేపట్టారని అధికారులను ప్రశ్నించారు. కాఫర్‌ డ్యామ్‌ కారణంగా నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు ఆటంకం కలిగితే ఎలా అని సందేహం వ్యక్తం చేశారు. సీఎం అడిగిన ప్రశ్నలన్నింటికీ అధికారులు వివరణ ఇచ్చారు. షెడ్యూల్‌ ప్రకారం దీని నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను అడిగితెలుసుకున్నారు.

సీఎంతో పాటు ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, రాష్ట్రమంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పి.విశ్వరూప్‌ పలువురు ఎమ్మెల్యేలు పర్యటనలో పాల్గొన్నారు.

(Except these headline  content taken in the eenadu news)

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *

£0.000 items